Hyderabad, ఏప్రిల్ 15 -- ఎన్ని ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా ఒక్కసారి జుట్టు రాలడం మొదలైతే ఆందోళన తప్పదు. చుండ్రు, తలంతా పొడిబారడం, వెంట్రుకలు రాలడం ఇవన్నీ ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. వీటితో పాటు కలుషిత వాతావరణం, కెమికల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ టూల్స్ వాడటం వంటి వాటి వల్ల తల ఆరోగ్య బలహీనపడుతుంది. దీంతో జుట్టు పొడిబారడం, కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు మొదలవుతాయి. వీటన్నింటినీ ఇవన్నీ పరిష్కరించటానికి సహజమైన పరిష్కారం ఏదైనా ఉందా అంటే అది కలబంద అని చెబుతున్నారు నిపుణులు.

ఇంట్లో, పెరట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటే కలబంద మొక్కలో పోషకాలు, విటమిన్లు, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలొవెరాలో ఉండే విటమిన్‌లు A, C, E, B12లతో పాటు ఫోలిక్ యాసిడ్, యాంటి ఫంగల్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జుట్టు, తలపై చర్మానికి సహజమై...