Hyderabad, ఏప్రిల్ 25 -- జుట్టు అందాన్ని మరింత పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఒక్కోసారి ఆ జుట్టు చివర్లు చిట్లిపోయి, దాన్ని కళ తప్పుతుంది. దువ్వినా చిక్కులు పడతాయి, చూడటానికి కూడా అంత బాగుండదు. అద్దంలో చూసుకుంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది. కారణాలేవైనా ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. మీరు కూడా మీ జుట్టు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లయితే ఈ కథనం మీకు కచ్చితంగా సహాయపడుతుంది.

వెంట్రుకల విషయంలో సరైన జాగ్రత్తలు, కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చివర్లు చిట్లిపోయేసమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. వీటితో మీ జుట్టు మళ్లీ ఒత్తుగా, ఆరోగ్యంగా, మెరిసేలా తయారవుతుంది. ఆ చిట్కాలేంటో తెలుసుకుని ట్రై చేయండి.

వెంట్రుకుల బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల దువ్వే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద పళ్ల దువ్వెన లేదా డీట్యాంగిల్ బ్...