భారతదేశం, డిసెంబర్ 5 -- రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ప్రణవ్ మోహన్ లాల్ తాజా చిత్రం 'డైస్ ఇరే'. థియేటర్లలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న తర్వాత ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది ఈ మలయాళ హారర్ థ్రిల్లర్. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ అసలైన హారర్ తో భయపెట్టే సినిమాలు మరింత స్పెషల్. ఈ డైస్ ఇరే ఇలాంటి మూవీనే. ప్రణవ్ మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది ఈ చిత్రం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

ఇండియా బయట ఉన్న ఆడియన్స్ కోసం డైస్ ఇరే మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది.సంప్లీ సౌత్ లో మలయాళం, తమిళం, తెల...