భారతదేశం, ఏప్రిల్ 9 -- అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం యావత్ ప్రపంచం చూసింది. వేలాది మంది అక్రమ వలసదారులను సైనిక విమానాల ద్వారా బహిష్కరించిన అధ్యక్షుడు ట్రంప్.. మిగిలిన వలసదారులను కూడా వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే తక్షణమే దేశం విడిచిపోవాలని అమెరికా వారికి చెబుతోంది. లేదంటే భారీగా జరిమానా ఉంటుందని అంటోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది వలసదారులను సైనిక విమానాల ద్వారా బహిష్కరించడమే కాకుండా, దేశంలో వారిని నిశితంగా పరిశీలిస్తోంది. వలసదారుల గురించి ట్రంప్ త్వరలోనే మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాయిటర్స్ నివేద...