Hyderabad, ఏప్రిల్ 20 -- ప్రతి వారం సరికొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలల్లో రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా, ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమాల్లో డియర్ ఉమ ఒకటి. లవ్ అండ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన డియర్ ఉమ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం వహించారు.

డియర్ ఉమ సినిమాతో తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా పరిచయం అయింది. అనంతపురానికి చెందిన సుమయ రెడ్డి డియర్ ఉమకు రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. పృథ్వీ అంబర్ హీరోగా చేసిన ఈ సినిమాలో కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ ఫేమ్ పృథ్వీరాజ్ నటించారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విడుదలకు ముందు డియర్ ఉమ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ .. "సాయి రాజేష్ అద్భుతంగా డియర్ ఉమ చిత...