భారతదేశం, నవంబర్ 27 -- అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చేశారు. రెండు దశల్లో ఈ పనులు జరగనున్నాయి. దేవతల రాజధాని మాదిరిగానే ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

'2003లో క్లైంబర్ మెయిన్స్ పెట్టినా నాకు ప్రాణ బిక్ష పెట్టినది వెంకటేశ్వరస్వామి. ఈ ప్రదేశంలో ఏ తప్పు జరగనివ్వను. తప్పు చేస్తే వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. అమరావతి రైతులకు నరకం చూపించారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారు.' అని చంద్రబాబు అన్నారు.

రూ.260 కోట్ల పనులను రెండు దశల్లో చేస్తారు. మొదటి దశలో కాంపౌండ్ వాల్, ఏడు అంతస్తుల మహా గోపురం, ఆర...