భారతదేశం, జూలై 25 -- వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం సహా వ్యక్తిగత కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజుల వరకు సెలవు తీసుకోవచ్చని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ''సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజుల సెలవుకు అర్హులు. దీనిని వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం వంటి వ్యక్తిగత కారణాల కోసం ఉపయోగించవచ్చు'' అని వెల్లడించారు.

వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు తీసుకునే వెసులుబాటు ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. 'సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1972 ప్రకారం 30 రోజుల ఆర్జిత సెలవులు, 20 రోజుల హాఫ్ పే లీవ్, 8 రోజుల క్యాజువల్ లీవ్, సంవత్సరానికి రెండు రోజుల పరిమిత సెలవులతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇతర అర్హత కలిగిన సెలవ...