భారతదేశం, మే 11 -- వీర జవాన్‌ మురళీనాయక్‌ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. మురళీనాయక్‌ కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీనాయక్‌ భౌతికకాయానికి మంత్రులు నారా లోకేష్‌, అనిత, సవిత నివాళులర్పించారు. కళ్లితండాలో మురళీనాయక్‌ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికార లాంఛనాలతో మురళి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

యుద్ధంలో అసువులు బాసిన వీరజవాన్‌ మురళీనాయక్‌ కుటుంబ సభ్యులను శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్.. కళ్లితండాకు చేరుకుని దంపతులను ఓదార్చారు. అంతకుముందు మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌సమంత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఉపాధి కోసం మహారాష్ట్రకు వచ్చిన ఆ దంపతులకు.. అ...