భారతదేశం, మే 13 -- భారత్-పాక్ పోరులో వీర మరణం పొందిన జవాన్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులను వైసీపీ చీఫ్ జగన్‌‌మోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు వెళ్లిన మాజీ సీఎం.. మురళీనాయక్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మురళి తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మురళీ త్యాగం అందరికీ స్పూర్తి అని కొనియాడారు. రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు.

జగన్‌ను చూడగానే మురళీ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. 'మురళీ జగన్ సార్ వచ్చాడ్రా.. సెల్యూట్ కొట్టరా మురళీ' అని అతని తండ్రి విలపించారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరితో కన్నీరు పెట్టించింది. మురళీ తల్లిని జగన్ ఓదార్చారు. ఎప్పుడైనా కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జగన్ వెంట సత్యసాయి జిల్లా వైసీపీ నేతలు పరామర్శకు వెళ్లారు.

జగన్‌ మంగళవారం ఉదయం 9.30...