భారతదేశం, జూన్ 16 -- నీట్​ యూజీ 2025లో ఉత్తీర్ణత సాధించిన వారి కథలు, కష్టాలు, నిద్రలేని రాత్రుల గురించి ఇప్పుడు దేశ ప్రజలు సోషల్​ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరైన రోహిత్​ కుమార్​ కథ ఇప్పుడు వైరల్​గా మారింది. జంషెడ్​పూర్​కి చెందిన రోహిత్​ కుమార్​.. వీధుల్లో మొబైల్​ కవర్లు అమ్ముకుంటూ, నీట్​యూజీకి ప్రిపేర్​ అయ్యాడు. పరీక్షను క్రాక్​ చేశాడు.

నీట్​ యూజీ 2025లో రోహిత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 12,484వ ర్యాంకు సాధించాడు. ఝార్ఖండ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాలని ఆశిస్తున్నాడు.

ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే రోహిత్ కుమార్‌ను అతని బండి వద్దకు వెళ్లి అభినందించారు. ఆ వీడియోను సోషల్​ మీడియాలో పంచుకున్నారు. నీట్ 2025 లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులందరికీ ఉచిత కోచింగ్ అందించే ఫిజిక్స్ వాలా 'ఉమ్మీద్ బ్...