భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పుతున్నారు. విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
జనాలు కింద అధిక సంఖ్యలో గుమిగూడినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. భవనం దగ్గర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. నాల్గో అంతస్తులో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ లోపల విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసు, అగ్నిమాపక శాఖ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బాల్కనీల ద్వారా పైన చిక్కుకున్న వారిని కిందకు దించే ప్రయత్నం చేశారు.
ఇటీవలే నాంపల్లిలోని ఫర్నిచర్ మాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.