భారతదేశం, జనవరి 1 -- కొత్త ఏడాది 2026 ఉత్సాహంగా మొదలైంది. మరి ఈ మొదటి వీకెండ్‌ను (జనవరి 2-4) మరింత చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే భాగ్యనగరం మీకోసం అద్భుతమైన వేదికలను సిద్ధం చేసింది. సంగీత ప్రియులైనా, సంప్రదాయాల ప్రేమికులైనా లేదా యువత మెచ్చే 'అనిమే' ప్రపంచమైనా.. ఈ వీకెండ్ హైదరాబాద్‌లో అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా జనవరి 4, ఆదివారం నాడు నగరం నలుమూలలా జరగనున్న మూడు ప్రధాన ఈవెంట్స్ ఇవే..

శాస్త్రీయ సంగీతాభిమానులకు ఇదొక గొప్ప అవకాశం. ప్రఖ్యాత గాయని కౌషికి చక్రవర్తి తన గాత్రంతో హైదరాబాద్‌ను మంత్రముగ్ధులను చేయనున్నారు. 'సుర్మండల్' అనే స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరి నూతన సంవత్సరానికి ఒక పరిపూర్ణమైన ఆరంభం అని చెప్పవచ్చు.

ఏమిటి: పాటియాలా ఘరానాకు చెందిన కౌషికి చక్రవర్తి హిందుస్తానీ గాత్ర కచేరీ. వీరికి హార్మోనియంపై...