భారతదేశం, నవంబర్ 24 -- రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన జోడీ ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కలిసి నటించిన ఈ జంట లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఒక దశలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ జంట మౌనంగా ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ఈవెంట్‌లో రామ్ గురించి భాగ్యశ్రీ మాటలు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులను నమ్మేలా చేసింది.

''రామ్ పోతినేనికి ప్రేమంతా దక్కాలి. తమ అభిమానులను అంతగా ప్రేమించే వ్యక్తి ఎవరో, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి ఎవరో, వారికోసం సినిమా తీసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ఒక్కరే.. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. అతనే రామ్'' అని భాగ్యశ్రీ తన మాటలతో రామ్ పై ప్రేమ కురిపించేసింది. భాగ్యశ్రీ ఇలా...