భారతదేశం, ఏప్రిల్ 20 -- అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీసం మంత్రులకైనా ఆదేశాలివ్వాలని కోరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నారని ఆరోపించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పెద్దపల్లిలో ఓ ...