Hyderabad, జూలై 8 -- మన దేశం భిన్న సంస్కృతులకు, భిన్న సంప్రదాయాలకు నిలయం. మన భాష, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. భగవంతుని ఆరాధించడంలో కూడా అదే కనిపిస్తుంది. చరాచర సృష్టికర్త, ఆద్యంతాలు లేని నిరాకారుడైన సర్వాంతర్యామికి వివిధ ప్రాంతాలలో ఆలయాలను నిర్మించి పూజించడం ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతోందని పురాణగ్రంథాలు తెలుపుతున్నాయి.

ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అవి ఆలయ నిర్మాణం, క్షేత్ర ప్రాధాన్యం, వెలిసిన దేవరూపం, అక్కడ జరిగే ఉత్సవాలు, అవే పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత కలియుగంలో విగ్రహారాధనకు అగ్రస్థానం అందించారు. దానికి కారణాలు అనేకం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద, పద్మ, స్కంద, కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్...