భారతదేశం, మే 10 -- సరిహద్దులో భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్​ షెల్లింగ్​కి జమ్ముకశ్మీర్​ అడ్మినిస్ట్రేషన్​ సర్వీసెస్​ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీలోని తన నివాసంపై శనివారం తెల్లవారుజామున పాక్​ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్​కు చెందిన అంకితభావం కలిగిన అధికారిని కోల్పోయామని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పేరు రాజ్​ కుమార్​ థప్పా అని తెలిపారు.

"ఈ రోజు ఆ అధికారి నివాసంపై పాక్ షెల్లింగ్ జరిగింది. అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాప్పాను చంపారు," అని అబ్దుల్లా చెప్పారు.

"నిన్ననే డిప్యూటీ సిఎంతో కలిసి ఆయన జిల్లా అం...