Hyderabad, జూలై 18 -- దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న మూవీ 'విశ్వంభర'. ఇందులో చిరంజీవి, త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, ఆశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచీ, దర్శకుడి మునుపటి ఫాంటసీ మూవీ 'బింబిసార'తో.. చిరంజీవి 1990లో వచ్చిన మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'తో దీనిని పోల్చుతున్నారు. నెలల తరబడి మౌనంగా ఉన్న దర్శకుడు.. ఇప్పుడీ పుకార్లకు చెక్ పెట్టాడు. గుల్టే(Gulte)కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమా కథను లీక్ చేశాడు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ విశ్వంభర. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని లైన్ తో సాగనున్నట్లు తాజాగా దర్శకుడు వశిష్ట వెల్లడించాడు. తాజా ఇంటర్వ్యూలో వశిష్ట.. 'విశ్వంభర' హిందూ మతంలో ఉన్న 14 లోకాలలో ఒకదానిలో జరుగుతుందన...