భారతదేశం, డిసెంబర్ 26 -- 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంగరంగా వైభవంగా, పాఠకులతో కళకళలాడుతోంది. సుమారు నాలుగు వందల స్టాల్స్‌తో ఎన్‌డీఆర్ స్టేడియంలో తీర్చిదిద్దిన సుందర ప్రాంగణంలో పుస్తక సముద్రం అలలాడుతోంది.వీటిలో ఆరో నెంబర్ స్టాల్‌లో ఉన్న సాఫ్ట్ నెట్ టీ-సాట్ (తెలంగాణ స్కిల్స్, అకడమిక్స్ అండ్ ట్రైనింగ్) అందరినీ ఆకట్టుకుంటోంది.

''ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలి. ప్రతి మెదడుకు జ్ఞానం చేరాలంటే... పుస్తకాలతోనే సాధ్యమవుతుంది'' అని వల్లనే అని పెద్దలు అంటుంటారు. కానీ, ఇప్పుడు మారుతున్న కాలానికి తగినట్టుగా పుస్తకం కూడా రూపం మార్చుకుంది. ఆ డిజిటల్ పుస్తకాన్ని తెలంగాణలో ఇంటింటికి చేర్చేందుకు టీ-సాట్ కృషి చేస్తోంది. టీ-సాట్ తీసుకొచ్చిన ఈ డిజిటల్ విద్యా విప్లవం తెలంగాణ యువతకు, విద్యార్థులకు భవితకు బాటలు వేస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత... టీ-సాట్ నె...