భారతదేశం, నవంబర్ 15 -- పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీలో నిరాశ అలుముకొంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏదేమైనా జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల ఫలితం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఒక సందేశాన్ని ఇచ్చాయి. భవిష్యత్ లో రాష్ట్రంలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టత ఇచ్చాయి.

జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఇక తిరుగులేదనే వాతావరణం లేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చతికిలపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ తర్వాత ఎలాంటి ఫలితాలు సాధించిందో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.

త...