Visakhapatnam, ఫిబ్రవరి 7 -- విశాఖపట్నం అనగానే గుర్తుకొచ్చేవాటిలో ఒకటి ప్రకృతి రమణీయమైన సముద్రం కాగా మరొకటి ఆంధ్రులు ఉద్యమించి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో 1966లో చేపట్టిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పుడు మళ్లీ అదే నినాదంతో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశంతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నా జగన్‌ సర్కారు మాత్రం ఏమి పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

విశాఖలో ఉక్కు కర్మాగారం సాధన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. పదహారు వేల మందికిపైగా నిర్వాసితులు 22 వేల ఎకరాలు తమ భూములను స్వలాభం చూసుకోకుండా కారుచౌకగా ప్రభుత్వానికి అప్పగించారు. అనేక త్యాగాల ఫలితంగా 1990లో ప్రారంభమైన...