భారతదేశం, అక్టోబర్ 6 -- విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంలో తీసుకున్న చర్యలను, వచ్చిన ఫలితాలపై మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి, రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాది కాలంగా కేంద్రం మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉక్కు కర్మాగారం ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించామని, ఇది స్వాగతించదగిన పరిణామమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపిందని చంద్రబాబు వెల్లడించారు. రూ.11,440 కోట్ల కేంద్ర సహాయాన్ని గుర్తు చేశారు. కేంద్రంతో సమన్వయంతో ప్రయత్నాల ద్వారా ...