భారతదేశం, నవంబర్ 16 -- విశాఖ వేదికగా తలపెట్టిన సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఎంఓయూలు కుదిరాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి హామీలు వచ్చాయి.

మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. రెండు రోజుల్లో సుమారుగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించింది. కానీ ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువ ఒప్పందాలు కుదిరాయి. వీటి ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్య...