భారతదేశం, జనవరి 28 -- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను రైల్వే శాఖ శాశ్వతంగా 16 నుండి 20కి పెంచింది. ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించాలని కోరుకుంటున్నందున, ఉన్న కోచ్‌లు సరిపడక.. డిమాండ్‌ను తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అదనపు కోచ్‌లతో రైలు మొత్తం సీటింగ్ సామర్థ్యం దాదాపు 1,128 మంది ప్రయాణికుల నుండి దాదాపు 1,440కి పెరిగింది.

గతంలో ఈ రైలులో సీటింగ్ పరిమితి కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేట్లు ఉండేవి. అంటే ప్రయాణికులు దీనిలో ప్రయాణించేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రూట్‌లో వందేభారత్‌కు డిమాండ్ పెరిగింది. ఈ భారీ డిమాండ్‌ను నిర్వహించడానికి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి రైల్వే నాలుగు అదనపు కోచ్‌లను జోడించాలని నిర్ణయించింది. పొడిగించిన రైలు ఇప్పటికీ మునుపటిలాగే అదే షెడ్యూల్ ప్రకారం నడుస్తుంద...