భారతదేశం, డిసెంబర్ 18 -- విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలతోపాటుగా విజయనగరం శ్రీ రామనారాయణం ఆలయం పర్యటన చేయాలనుకునే టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ అందిస్తోంది. 1 రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్రతీ రోజూ ఉంటుంది. విశాఖలోని ప్రముఖ ఆలయాలు, పర్యటక ప్రదేశాలను తక్కువ ధరలో చూసిరావొచ్చు. గ్లోరియస్ ఆంధ్రా విత్ శ్రీ రామనారాయణం పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఇందులో సింహాచలం ఆలయం, తొట్ల కొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయాలతో పాటు బీచ్‌ను సందర్శించవచ్చు.

ఉదయం 07:00 - విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం చేస్తారు.

09:00 నుంచి 09:30 వరకు - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి రుషికొండ బీచ్‌కి వెళ్తారు. (14 కిమీ, 30 నిమిషాల ప్...