భారతదేశం, డిసెంబర్ 11 -- నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విశాఖపట్నం(భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ కింద) 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. 320 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.

320 పోస్టులు ట్రేడ్ వారీగా ఖాళీలు: ట్రేడ్‌లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, ఆర్&ఏసీ మెకానిక్, మెకానిక్ డీజిల్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, క్యంప్యూటర్‌ ఆపరేటింగ్‌తోపాటుగా పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్‌లో శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ్యర్...