భారతదేశం, ఏప్రిల్ 27 -- విశాఖపట్నంలోని దువ్వాడ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతుడు యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అటు యోగేంద్రబాబు భార్యపైనా విచక్షణారహితంగా దాడి జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇంట్లో నగలు చోరీ కాలేదని సీపీ శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. తెలిసినవారే హత్యచేసి ఉంటారని భావిస్తున్నట్టు వెల్లడించారు.

విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యోగేంద్రబాబు, లక్ష్మి 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి వచ్చార...