భారతదేశం, నవంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. విశాఖపట్నం, సింహాచలంలో భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖ వాసులు ఎక్కువగా భూకంపం చూశారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఈ సమయంలో శబ్ధం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖపట్టణంలోని పలు ప్రాంతాల్లో.. అరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందూర్తిలో తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద శబ్ధంతో భీమిలి బీచ్‌ రోడ్డులో భూమి కంపించింది.

మరోవైపు సింహాచలంలోనూ.. భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ కంపం వచ్చిన సమయంలో పెద్ద శబ్ధాలు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నార...