భారతదేశం, అక్టోబర్ 11 -- విశాఖఫట్నంలో సంచలనం రేపిన దోపిడీ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులు సొంత ఇంటివాళ్లే అని తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ సిటీ పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసు వివరాలు చూస్తే. కంచరపాలెంలో నివాసముంటున్న ధర్మాల ఆనందరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. అతనికి 24 ఏళ్ల కుమారుడు (కృష్ణకాంత్‌) ఉన్నాడు. తొందరగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మొదలు పెట్టాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. దీన్నించి బయటపడేందుకు సొంత ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ఆనందరెడ్డి అక్టోబర్ 4వ తేదీన ఓ శుభకార్యం కోసం హైదరాబాద్ సిటీకి వెళ్లాడు. ఇదే సరైన సమయమని భావించిన కృష్...