Visakhapatnam,andhrapradesh, జూలై 4 -- విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 క్లరికల్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీ వరకు అవకాశం ఉంది. నిజానికి జూన్ 30వ తేదీతోనే గడువు పూర్తి కాగా. అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి హైదరాబాద్, నెల్లూరు, రాయలసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. https://www.vcbl.in/downloads వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది. ...