Andhrapradesh, జూన్ 29 -- సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ లో చోరీ యత్నం జరిగింది. పల్నాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కాల్పులు జరపటంతో. దోపిడీ దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3.30 నుంచి 3.45 గంటల మధ్య ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అలారం గొలుసును లాగారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం. ఎస్కార్ట్ పోలీసులు దర్యాప్తు చేయడానికి రైలును ఆపారు. దీంతో నిందితులు పొలాల్లోకి పారిపోయారు.

హెచ్చరికలు జారీ చేసినా పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని అడ్డుకునేందుకు ఎస్కార్ట్ సిబ్బంది 9 ఎంఎం పిస్టల్ నుంచి ఐదు రౌండ్లు, 303 రైఫిల్ నుంచి నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీ...