భారతదేశం, ఏప్రిల్ 28 -- విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందన్నారు. ప్రపంచ డేటా అంత విశాఖ వస్తుంది, ఏఐ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచానికి అందించనున్నారన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఆంధ్రప్రదేశ్ మారనుందని తెలిపారు.

అమరావతి విట్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన మహాత్మాగాంధీ బ్లాక్ ,వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం కేంద్రంగా, 5 జోన్స్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వాట్సాప్‌ సేవ ద్వారా ప్రజలకు పరిపా...