భారతదేశం, మే 25 -- విశాఖలో వరుసగా మహిళల అదృశ్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరి కోసం కుటుంబ సభ్యులు.. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా.. కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మహిళల అదృశ్యానికి ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది.. ప్ర...