భారతదేశం, ఏప్రిల్ 16 -- ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల్ని ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ఐటీ ఆధారిత పరిశ్రమల్ని ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నించారు. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధుల్ని కలిసి ఏపీలో కార్యకలాపాలను నిర్వహించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ ఛైర్మన్‌తో స్వయంగా పలుమార్లు చర్చలు జరిపారు.

ఏపీ ప్రభుత్వ ఆహ్వానంతో రాష్ట్రంలో ఐటీ ఆధారిత పరిశ్రమల్ని ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలతో టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ ముందుకు వచ్చయింది. విశాఖపట్నంలోని ఐటి హిల్ నం.3లో రూ.1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడులతో దాదాపు 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

రాష్ట్రంలో...