Andhrapradesh,vizag city, ఏప్రిల్ 17 -- విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అభం శుభం తెలియ‌ని నాలుగేళ్ల కుమార్తెపై క‌న్న‌తండ్రే అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుత‌న్నారు.

ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమునిప‌ట్నంలో బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం ఓ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తికి భార్య‌, నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల‌ కుమారుడు ఉన్నారు. ఆ వ్య‌క్తి భార్య, పిల్ల‌ల‌తో విశాఖ‌ప‌ట్నం వ‌న్‌టౌన్‌లోని జాలారిపేట‌లో నివాసం ఉంటున్నాడు.

దాదాపు రెండేళ్లుగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివిధ కార‌ణాల‌తో గొడ‌వలు జ‌రుగుతున్నాయి. దీంతో భార్య జాలారిపేట‌లోనే ఉన్న పుట్టింట్లో పిల్ల‌ల‌తో ఉండ‌గా.. ప‌క్క ఇంట్లోనే భ‌ర్త వ...