భారతదేశం, డిసెంబర్ 12 -- విశాఖపట్నంలో రూ.3,700 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ తో పాటు మరో ఎనిమిది కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తో పాటు ఇతర కంపెనీల ద్వారా సుమారు 41,700 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా.

విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ రూ.1,583 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ వద్ద కాగ్నిజెంట్ కు ప్రభుత్వం 21 ఎకరాలకు పైగా కేటాయించింది. అక్కడ మూడు దశల్లో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను నిర్మిస్తుందని వారు వివరించారుయ

మొదటి దశ పూర్తయ్యే వరకు. కాగ్నిజెంట్ తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్క్, హిల్ -2లోని మహతి ఫిన్టెక్ బిల్డింగ్ నుంచి పని చేస్తుంది. ఏఐ, మెషి...