Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు.

మీడియేషన్ అంశం భారత్ కు కొత్తకాదని తరాలుగా మనకు అందుబాటులో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గతంలో మన పూర్వీకులు, గ్రామపెద్దలు సమర్ధంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని గుర్తు చేశారు.

" విశాఖపట్నంలో జ్యుడీషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించటం సంతోషదాయకం. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయవ్యవస్...