భారతదేశం, ఏప్రిల్ 22 -- సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్, విద్యార్థిని మధ్య సెల్ ఫోన్ కోసం వాగ్వాదం జరిగింది. కాలేజీలో సెల్ ఫోన్ చూస్తుందని లెక్చరర్ మందలించి విద్యార్థిని వద్ద నుంచి ఫోన్ తీసుకుంది. దీంతో లెక్చరర్ కి, స్టూడెంట్‌కి మధ్య గొడవ జరిగింది. ఆ ఫోన్ రూ.12 వేలు అంటూ విద్యార్థిని లెక్చరర్ ని బూతులు తిడుతూ గొడవకు దిగింది.

ఫోన్‌ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా? అంటూ విద్యార్థిని చెప్పు తీసింది. ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్...లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనను పక్కనున్న వారు వీడియో తీశారు. వీడియోలో విద్యార్థిని లెక్చరర్ ను దుర్భాషలాడడం, దాడి చేయడం రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వై...