Andhrapradesh, అక్టోబర్ 10 -- ఏపీలో విశాఖపట్నం డేటా సెంటర్లకు అతిపెద్ద కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ. భారీస్థాయిలో పెట్టుబడి పెట్టెందుకు యోచిస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ఒక గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్ ను అభివృద్ధి చేయనుంది. మొత్తం 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ .88,730 కోట్లు) పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో సచివాలయంలో నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబ...