భారతదేశం, జూన్ 16 -- విశాఖపట్నం: ఈనెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ (International Yoga Day) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పాల్గొంటున్న ఈ భారీ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నంలో స్వయంగా పర్యవేక్షించారు.

విశాఖలోని ఆర్కే బీచ్‌ను ప్రధాన వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్‌లు బీచ్ రోడ్డు వెంబడి, ఇతర వేదికల్లో చేసిన ఏర్పాట్లను సీఎంకు వివరంగా వివరించారు.

ఈ యోగాడే కార...