భారతదేశం, నవంబర్ 9 -- విశాఖ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తన అత్త సూటిపోటి మాటలతో వేధిస్తోందని భావించిన ఓ కోడలు ఆమెను భౌతికంగా లేకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి పక్కాగా ఓ ప్లాన్ రచించింది. దొంగా పోలీస్‌ ఆటంటూ అత్తపై కోడలు పెట్రోల్‌ పోసి హత్య చేసింది. పైగా ఏం తెలియనట్లు నటించే ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటికి వచ్చాయి.

విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు శనివారం నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు వివరాలను ఏసీపీ పృథ్వీతేజ, సీఐ సతీశ్‌కుమార్‌ వెల్లడించారు. పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని ఓ అపార్ట్ మెంట్ లో సుబ్రహ్మణ్యం, లలితాదేవి (30) దంపతులు ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కమారుడు ఉన్నాడు. వీరితో పాటే అత్త అయిన కనకమహాలక్ష్మి(63) నివాసం ఉంటోంది.

భర్త...