భారతదేశం, ఏప్రిల్ 20 -- ఈ విషాద ఘ‌ట‌న గురించి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన రాజేశ్వ‌ర‌రావు కుమారుడు ప్ర‌ణీత్ శిరం (24). 2019లో ఎన్ఆర్ఐ మెడిక‌ల్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాడు. క‌రోనా స‌మ‌యంలో త‌లెత్తిన కొన్ని ఇబ్బందులు నేప‌థ్యంలో చ‌దువులో కాస్తా వెనుక‌బ‌డ్డాడు. దీంతో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ వ‌చ్చాడు. ఇప్ప‌టికే ప్ర‌ణీత్‌తో చేరిన వారంద‌రూ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు.

బ్యాక్‌లాగ్స్ ఉండ‌టంతో ప్ర‌ణీత్ ఎంబీబీఎస్ పూర్తి చేయ‌లేక‌పోయాడు. ఇప్పుడు ప్ర‌ణీత్ ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ పార్ట్‌-2 చ‌దువుతున్నాడు. గ‌త కొద్ది రోజులుగా స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ణీత్ ఆ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాస్తున్నాడు. ఈసారి అయినా ఎలాగైన గ‌ట్టెక్కాల‌నుకున్నాడు. శ‌నివారం జ‌...