భారతదేశం, నవంబర్ 12 -- మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ఐఆర్‌సీటీసీ అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలోనే ఉత్తరాంధ్రకు వెళ్లి రావాలంటే మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. కిర్రాక్ బీచ్‌లు, ప్రకృతి అందాలు, కొండలు, ఆలయాలు చూసి రావొచ్చు. వైజాగ్ రీట్రీట్ పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, అరకు, సింహాచలం చూసి రావొచ్చు. ఈ టూర్ నవంబర్ 17న అందుబాటులో ఉంది. మూడు రోజులు, రెండు రాత్రుల ప్యాకేజీ ఇది.

విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వచ్చిన టూరిస్టులను పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేయాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. భోజనం తర్వాత తొట్లకొండ బౌద్ధ ఆలయాలు, కైలాష్ గిరి, రుషికొండ బీచ్ తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి వస్తారు. రాత్...