Andhrapradesh, జూన్ 20 -- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్‌ కొలువుదీరనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం - కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా. 1,582 కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నారు. ఫలితంగా 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన కాగ్నిజెంట్ కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కేవలం 99 పైసలకే ఆ సంస్థకు ఎకరా భూమి కేటాయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కొన్ని నెలల కిందట విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూములను రూపాయికే కేటాయించటం సర్వత్రా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

కాగ్నిజెంట్ మార్చి 2029 నాటికి విశాఖపట్నంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం కాగ్నిజెంట్ సంస్థ...