Andhrapradesh, జూలై 24 -- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్... మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మత సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్ఎస్ఆర్ సంస్థలు రూ.20,216 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా... ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్‌గా ఉన...