భారతదేశం, ఏప్రిల్ 19 -- టెక్ కంపెనీ వివో త్వరలో కొత్త ఫోన్‌ను భారత్‌లోకి తీసుకురానుంది. వివో ఇండియా వెబ్‌సైట్‌లో ఈ డివైజ్ కనిపించినందున వివో త్వరలోనే వివో వై 19 5జీని భారత మార్కెట్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి వివో ఇంకా ఎటువంటి అధికారిక పోస్టర్‌ను విడుదల చేయలేదు. కంపెనీ దీనిని రహస్యంగా ప్రదర్శించవచ్చని తెలుస్తోంది.

డిజైన్ విషయానికి వస్తే ఇది వివో వై19ఈలో మనం చూసిన విధంగానే కనిపిస్తుంది. వివో వై19ఈలో ఉన్న ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల ఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. ఆక్టాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఫన్ టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయ...