భారతదేశం, మే 23 -- చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ.. వివాహ రిజిస్ట్రేషన్‌ మాత్రం చేసుకోవడం లేదు. అవసరమైనప్పుడు చూసుకుందామనే భావనతో వదిలేస్తున్నారు. అలా కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. సమయం, డబ్బు వృథా కాకుండా చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుతో పాటు.. వరుడు, వధువు పదో తరగతి మెమో జిరాక్స్, ఆధార్‌ కార్డులు, పెళ్లి ఫొటోతో పాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఇద్దరేసి సాక్షులు, వారి ఆధార్‌ కార్డులు, పెళ్లి శుభలేఖ జత చేయాలి. పెళ్లి జరిగిన నెలలోపు దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే.. వారు పరిశీలించి పురపాలక లేదా పంచాయతీ కార్యాలయానికి పంపుతారు. ఆ తర్వాత రూ.500 ఫీజు చెల్లించి మూడు, నాలుగు రోజుల్లో వివాహ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం పొందొచ్చు. అలా ...