భారతదేశం, ఆగస్టు 7 -- వివాహ బంధం అంటే నూరేళ్ల పంట. అదో పవిత్రమైన బంధం. కానీ, ఆధునిక ప్రపంచంలో ఈ సంప్రదాయంపై ఎన్నో సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేటి యువతరం వివాహ బంధం గురించి భిన్నంగా ఆలోచిస్తోంది. కొందరు వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొందరు పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కనడం, కుటుంబాన్ని పోషించడం లాంటి సంప్రదాయ బాధ్యతలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, వివాహ వ్యవస్థ దాని ప్రాముఖ్యతను నెమ్మదిగా కోల్పోతోందా అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వివాహం అనేది రాబోయే రోజుల్లో కనుమరుగు అవుతుందా?

ఈ విషయాలపై ప్రముఖ మాజీ సివిల్ సర్వెంట్, దిల్లీలోని దృష్టి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు వికాస్ దివ్యకీర్తిని ఒకరు ప్రశ్నించారు. "వివాహ వ్యవస్థకు భవిష్యత్తులో ప్రమాదం ఉందా?" అని అడిగిన...