భారతదేశం, నవంబర్ 25 -- ఈరోజు వివాహ పంచమి. పైగా ఈరోజు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించి సంసప్తక రాజయోగంను ఏర్పరుస్తున్నాడు. గురువు-చంద్రుల కలయిక వలన ఈ అరుదైన యోగం ఏర్పడింది. అలాగే గజకేసరి రాజయోగం కూడా ఏర్పడింది. అలాగే ఈరోజు కుజుడి కారణంగా రుచక రాజయోగం ఏర్పడింది.

ఇలా ఈ రాజయోగాల వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. శ్రీరాముని అనుగ్రహం కూడా ఉంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి ఈరోజు వివాహ పంచమి వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సానుకూ...