భారతదేశం, నవంబర్ 25 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం పూజలు చేయడం, పరిహారాలను పాటించడం, ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. నాగ, సర్ప దోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం.

రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఇవి మూడు కూడా కర్ణాటకలో వెలసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు. మరో విషయం ఏంటంటే, ఈ మూడు ఆలయాలని కలిపితే సర్పాకారం వస్తుంది. ఇక ఈరోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ...