భారతదేశం, జూన్ 19 -- తెలంగాణలో వృద్ధుల కోసం విలాసవంతమైన వృద్ధాశ్రమం రూపొందుతోంది. ఇది సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునేవారికి అనువైనదిగా ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో బైంసా సమీపంలోని చాతా గ్రామంలో అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతోంది. ఈ ఆశ్రమం హెలిప్యాడ్ సౌకర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంస్థ సీఈఓ బద్దం భోజరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.

'వృద్ధులకు దూర ప్రయాణాలు కష్టం. అత్యవసర వైద్య అవసరాల కోసం లేదా విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులను త్వరగా కలవడానికి వీలుగా మూడు ఎకరాల్లో హెలిప్యాడ్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో 40 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.' అని భోజరెడ్డి తెలిపారు.

ఈ ఆశ్రమం...